Posani: పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసినదే. ప్రస్తుతం ఈయన రాజంపేట సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఈయన గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటంతోనే ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదు కావడంతో పోలీసులు తనని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఇలా పోసాని జైలుకు వెళ్లిన తరువాత కొన్ని గంటలకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈయన విరేచనాలతో బాధపడుతున్న నేపథ్యంలో పోలీస్ లు ఆయనకు వైద్య చికిత్సలు అందించారు అనంతరం కడుపులో నొప్పి తీవ్రమైన చాతి నొప్పి అంటూ పోసాని చెప్పడంతో పోలీసులు రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కడప రిమ్స్ ఆస్పత్రిలో పోసానికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించారు అయితే రెండు మూడు సార్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ కూడా తనకి చాతిలో ఏ విధమైనటువంటి నొప్పి రాలేదని, వైద్య అధికారులు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. ఈ విధంగా పోసాని ఆరోగ్యం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చాతిలో నొప్పి వస్తుంది అంటూ పోసాని డ్రామాలు చేశారు అంటూ సీఐ ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడడం లేదు.ఇంకొన్ని వైద్య పరీక్షల రిజల్ట్స్ వచ్చాక వెంటనే ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్తాము అంటూ సీఐ తేల్చి చెప్పారు. అయితే గత కొంతకాలంగా పోసాని గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన ఈ సమస్యకు మందులు కూడా వాడుతున్నట్లు పోలీసులు అరెస్ట్ కు ముందు వైద్య పరీక్షలను నిర్వహించగా వైద్య అధికారులు వెల్లడించారు.