ప్ర‌ధాని మెప్పుకొసం జ‌గ‌న్ ముందే మేల్కొన్నాడా?

వ‌ల‌స కార్మికుల బాధ్య‌త రాష్ర్టాలు తీసుకోవాల్సిందేన‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. వాళ్ల‌కి అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించాల్సిన బాధ్య‌త రాష్ర్ట ప్ర‌భుత్వాలిదేన‌ని ప్ర‌ధాని మోదీ చెప్ప‌క‌నే చెప్పారు. ఇక్క‌డ ప్రాంతం గానీ, కుల‌, మ‌తాలు గానీ ఎలాంటి వివ‌క్ష లేకుండా చూడాల‌న్నారు. వ‌ల‌స కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు చేర్చ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని..అవ‌స‌ర‌మైతే శ్రామిక్ రైళ్ల‌ను పెంచుతామ‌ని..ఆ ఖ‌ర్చును కూడా రాష్ర్ర ప్ర‌భుత్వాలే భ‌రించాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అయితే కేంద్రం వ‌ల‌స కార్మికుల‌పై ఇలాంటి నిర్ణ‌యం తీసుకోక ముందే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వాళ్ల‌ప‌ట్ల ఉదార‌త చూపించాల‌న్నారు.

అలాగే వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల సౌక‌ర్యాలు భోజ‌నం, నీరు, వ‌స‌తి క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే రాష్ర్ట స‌రిహ‌ద్దు వారికోసం ప్ర‌త్యేకంగా బ‌స్సులు వేసి త‌ర‌లించాల‌ని తెలిపారు. ఆ ఖ‌ర్చులు మొత్తం రాష్ర్ట ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేసారు. అయితే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం కేంద్రం నుంచి ఆదేశాల రాక‌ముందే(ఒక్క రోజు) తీసుకోవ‌డం విశేషం. అయితే చాలా రాష్ర్టాల సీఎంలు మేము ఎందుకు వ‌స‌ల కార్మికుల ప‌ట్ల చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నించాయి. జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించిన‌ప్పుడు ఆ బాధ్య‌త‌లు కేంద్ర‌మే తీసుకోవాల‌న్నాయి. వాళ్ల‌కి అన్ని ర‌కాల వ‌స‌తులు కేంద్రం క‌ల్పించాల‌ని సూటిగా అడిగాయి.

పైగా త‌మ రాష్ర్టాల్లో ప‌నిచేస్తున్న‌ది బ‌య‌ట రాష్ర్టాల వార‌ని…ఇక్కడ ఉఫాది క‌ల్పించ‌డమే రాష్ర్టాలు చేసిన త‌ప్పా? అని ప్ర‌శ్నించాయి. పైగా ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీలో ఇలాంటి నిరుపేద‌ల‌కు బ‌డ్జెట్ ఎంత‌ కేటాయించారో? చెప్పాల‌న్నారు. అయితే జ‌గ‌న్ మాత్రం ఇలాంటి ప్ర‌శ్న‌లేవి కేంద్రంపై గుప్పిచ‌కుండా సైలెంట్ గా తాను చేయాల‌నుకున్న‌ది చేసేసాడు. అప్పుల్లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇది అద‌నంగా కొంత న‌ష్టం. అయినా జ‌గ‌న్ ఆ న‌ష్టాన్ని లెక్క చేయ‌కుండా ముందుకెళ్తున్నాడు. దీంతో జ‌గ‌న్ తీరుపై ప్ర‌తిప‌క్షాల‌కు కొత్త సందేహాలు వ‌స్తున్నాయి.

కేంద్రం చెప్ప‌క‌ముందే జ‌గ‌న్ క‌దిలాడంటే ఏదో మెలిక లేకుండా ఇలా చేయ‌డ‌ని అంటున్నాయి. ప్ర‌ధాని మెప్పు కోస‌మే జ‌గ‌న్ ఇలా చేసాడంటున్నారు. ముందొస్తు గా వ‌ల‌స కార్మికుల‌పై ప్రేమ చూపిస్తే జ‌గ‌న్ పై ఉన్న కొన్ని కేసుల నుంచైనా తొంద‌ర‌గా ఉప‌శ‌మ‌నం దొరుకుతుందానే! ఇలా వ‌ల‌స కార్మికుల‌పై ప్రేమ ఒల‌క‌బోస్తున్నాడ‌ని అంటున్నారు.