Corona: మీరు కరోనా బారిన పడ్డారా.. కరోనా నుంచి తొందరగా కోలుకోవాలంటే ఇవి పాటించాల్సిందే!

Corona: కరోన వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా విస్తరిస్తోంది. రోజు రోజుకి ఈ వ్యాధి బారిన పడే వ్యక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలన్ని నివారణా చర్యలు తీసుకున్న దీనిని కట్టడి చేయడం చాలా కష్టతరంగా మారింది. గత రెండు సంవత్సరాల నుండి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. అమెరికా లాంటి సంపన్న దేశాలు కూడా కరోనా దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. లాక్ డౌన్, ఇతరత్రా ఆంక్షలు అమలు చేసి covi-19 నియంత్రణ జరుగుతోంది అన్న సమయంలో థర్డ్ వేవ్ రూపంలో ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఆరు దేశాలలో లక్షకుపైగా కొత్త కరోన కేసులు వెలుగుచూశాయి అంటే దీని తీవ్రత ఎంతలా ఉందో ఊహించుకోవచ్చు. మన దేశంలో కూడా గడిచిన 24 గంటల్లో లక్షా యాభై వేల కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ వంటి నివారణ చర్యలు చేపడుతున్నాయి. అయితే ఇది ఎవరికి ఎప్పుడు ఎలా సంక్రమిస్తుందో అర్థం కావడం లేదు. మీరు గనుక కరోనా బారిన పడినట్టు అయితే మీరు త్వరగా కోలుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే.

కరోనా సోకిన వారందరికీ ప్రాణాపాయం ఉండదు. అందువలన కరోనా సోకిన వ్యక్తి మానసికంగా దృఢంగా ఉండాలి. టెన్షన్, ఒత్తిడి, ఆందోళన మన ఆరోగ్యాన్ని ఇంకా దిగజారుస్తాయి. కరోనా సోకిన వారు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ప్రశాంతతకు అవసరమయ్యే యోగ చేయటం ఆరోగ్యానికి మంచిది . ప్రాణాయామం చేయటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు .

కరోనా వ్యాధి బారిన పడిన వారు డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ మోతాదులో నీరు తాగాలి. నీరు ఎక్కువ మోతాదులో తాగడం చాలా అవసరం. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. కరోనా వ్యాధిగ్రస్తులు ఎక్కువ
విశ్రాంతి తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు.

అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఫ్రెష్ గా ఉండే కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్, మసాలా ఫుడ్, శీతల పానీయాలు, ఆల్కహాల్, బర్గర్, పిజ్జా వంటి వాటికి దూరంగా ఉండాలి.

రోజు వ్యాయామాలు చేయడం వల్ల శరీర ఆరోగ్యం బాగా ఉంటుందని అందరికీ తెలుసు. కరోనా వచ్చిన వ్యక్తులు కూడా వ్యాయామం, ప్రాణాయామం చేయడం వల్ల యాక్టివ్ గా ఉంటారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా వ్యాయామాలు చేయడం ద్వారా ఇతర దీర్ఘకాలిక సమస్యల భారిన పడకుండా ఉంటారు అని నిపుణులు సూచిస్తున్నారు.