తిరుపతి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కొన్ని నిరర్ధక ఆస్తుల్ని విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు, మరొకొన్ని అనుబంధం సంఘాలు వివాదాస్పదంగా మార్చాయి. ఒక్క టీటీడీకి సంబంధించిన భూములే కాదు. దేశంలోని పలు దేవాలయాలు, ధర్మాదాయ సంస్థల నిరర్ధక ఆస్తుల్ని బహిరంగ వేలాల్లో విక్రయించిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. టీడీకి దేశవ్యాప్తంగా భూములున్నాయి. వీటిలో అన్నింటిని నిర్వహించడం టీటీడీకి సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాల్లో నిరర్ధక ఆస్తుల్ని విక్రయించడం ఆ సొమ్ము బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం సంప్రదాయంగా వస్తోంది.
కేవలం నిరర్ధక ఆస్తులే కాదు..స్వామివారికొచ్చిన బంగారాన్ని కూడా బహిరంగా మార్కెట్ లో విక్రయించి ఆ సొమ్మును బ్యాంకుల్లో ధరవతుగా పెట్టి వచ్చే వడ్డీని టీటీడీ నిర్వహించే ఆథ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకకు వినియోగిస్తుంటుంది. రాష్ర్టంలో ఎన్టీఆర్ ఉన్నా, వైఎస్ ఆర్ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా ఇలాంటి విక్రయాలు జరగడం సహజం. ఇది విపక్షాలకు, నాటి నాయకులకు తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితిని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి సమయంలో నిబంధనలు అమలవుతాయా? విక్రయం చట్ట పరధిలో సాగుతుందా? ఆస్తులు నిరర్ధకమైనవా? కావా? వాటిని టీటీడీ నిర్వహించగలదా? విక్రయ ప్రతిపాదనపై నిబంధనలకు అనుగుణంగా రాష్ర్ట హైకోర్టు అనుమతి ఉందా? వంటి అంశాలను విపక్షాలు, విమర్శకులు ముందుగా పరిశీలించాల్సిన అంశాలు. వాస్తవానికి దేవాదయ ఆస్తులు విక్రయం చాలా సంక్లిష్టతో కూడుకున్నది. గతంలో ప్రభుత్వాలు, పాలకులు ఇష్టాను సారం ఇలాంటి భూములు అమ్మేసేవారు. తాబేదార్లకు పంచి పెట్టేవారు. తూతూ మంత్రంగా వేలం వేసి ఆపన్నులకు ప్రయోజనాలు చేకూర్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
గతంలో జరిగిన అవకతకలపై న్యాయస్థనాలు సీరియస్ గా స్పందించాయి. దేవాదయ భూములు విక్రయానికి ముందు హైకోర్టు అనుమతి తీసుకోవాలి. వాటిని మార్కెట్ ధరకంటే ఎక్కువగా అమ్మాలి. ఒవవేళ ప్రభుత్వం తన పథకాల కోసం దేవాదయ భూముల్ని సేకరించాలన్నా! ఇదే విదానాన్ని అనుసరించాలి. ఇతరులతో పాటు ప్రభుత్వం సమానాంగా వేలంలో పాల్గొనాలి. మరి ప్రభుత్వం ఇవన్ని చేసి ముందుకు వెళ్తుందా? ప‌్రతిపక్షాలకు ఈ విషయాలన్ని తెలిసి మాట్లాడుతున్నాయా? రాజకీయం చేస్తున్నాయా? అన్నది వాళ్లకే తెలియాలి. అయితే ప్రస్తుతం అధికార పక్షం తీరు..ప్రతిపక్షం తీరు చూస్తుంటే అసలు ఇది వివాదం ఎలా అన్న సందిగ్ధం నెలకొంది.