Bigg Boss : బిగ్‌బాస్ బూతులు వెర్సస్ పొలిటికల్ బూతులు.!

 Bigg Boss : బిగ్‌బాస్ హౌస్‌ అంటేనే అదో అడల్ట్ కంటెంట్ రియాల్టీ షో అని అందరికీ తెలిసిందే. అందులో నో డౌట్. బుల్లితెర నుంచి డిజిటల్ తెరకు ప్రమోట్ అయ్యిందిప్పుడు బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ రియాల్టీ షో.
ఈ రియాల్టీ షోలోని కంటెస్టెంట్ల మధ్య అన్ని రకాల ఎమోషన్స్ పండుతుంటాయ్. అలాగే అప్పడప్పుడూ వాళ్ల మాటల్లో అసభ్యకరమైన మాటలు అదేనండీ వల్గర్ మాటలు కూడా దొర్లుతుంటాయ్. కానీ, అదో గేమ్ షో. దాన్ని తప్పుపట్టడానికి లేదు.
అలాంటి ఓ గేమ్‌షో మీదనే సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వల్గారిటీ బాగా ఎక్కువయ్యిందంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. బిగ్‌బాస్ నిర్వాహకుల మీద కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సరే, బిగ్‌బాస్ అంటేనే అదో బూతు షో అని జనం ఎప్పుడో ఫిక్స్ అయిపోయారనుకోండి. అది వేరే సంగతి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పొలిటికల్ బూతు పురాణం గురించి. పబ్లిక్‌లో ప్రజా ప్రతినిధుల బూతుల పురాణం ఈ మధ్య చాలా ఎక్కవయిపోయింది. ఉన్నతమైన గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నరాజకీయ నాయకులు సైతం ఈ మధ్య బూతులతో రెచ్చిపోతున్నారు.
ఆ బూతు పంచాయితీలను అచ్చంగా అలాగే టెలికాస్ట్ చేసి చూపించేస్తున్నారు న్యూస్ ఛానెళ్లు సిగ్గు లేకుండా. చట్ట సభల్లో సైతం బాధ్యతలు మర్చిపోయి బూతు పురాణం అందుకుంటున్నారు. వల్గర్ బిహేవియర్‌తో ఒళ్లు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు పొలిటీషియన్లు.
కేవలం ఒక రియాల్టీ షో అయిన బిగ్‌బాస్ షోని వ్యతిరేకించేందుకైతే పొలిటికల్ మేధావులు సైతం తమ టాలెంట్ ఉపయోగించి కేసుల గురించి మాట్లాడేస్తున్నారు. మరి, పబ్లిక్‌లో పెచ్చిపోతున్న ఈ బూతు రాజకీయ నాయకులపై కేసుల సంగతేంటి అధ్యక్షా.?