ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగా చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఘనంగా విడుదల చేయగా. ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. మళ్లీ పుట్టి వచ్చినవా అని సాగే ఈ పాటకి సాబు వర్గీస్ మ్యూజిక్ అందించగా వరికుప్పల యాదగిరి రచయితగా, గాయకుడిగా వస్తున్న ఈ పాట సినిమాకి పెద్ద ఎస్సైటు గా నిలుస్తుంది. చదలవాడ శ్రీనివాస్ రావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియా సినిమాగా 8 భాషల్లో ఈ సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ వర్క్ నడుస్తోంది అతి త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతి భారతీయుడు కచ్చితంగా చూసి గర్వపడే చిత్రంగా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : మా సినిమా రికార్డ్ బ్రేక్ నుంచి సెకండ్ సాంగ్ గా మళ్లీ పుట్టి వచ్చినవా సాంగ్ విడుదల చేసాము. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కి మంచి స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మా ఆర్టిస్టులు టెక్నీషియన్లు రాత్రానక పగలనకా ఎండనక వాననక చాలా సపోర్ట్ ఇచ్చారు. చిత్రీకరణ కి సంబంధించిన కొన్ని లొకేషన్ విజువల్స్ మీడియాతో పంచుకుంటున్నాను. అతి త్వరలో గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాము. ప్రేక్షకులందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
తారాగణం : నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్
టెక్నీషియన్స్ :
కథ : అంజిరెడ్డి శ్రీనివాస్
సంగీతం : సాబు వర్గీస్
ఎడిటింగ్ : వెలగపూడి రామారావు
డిఓపి : కంతేటి శంకర్
PRO : మధు VR
కో-డైరెక్టర్లు : కూరపాటి రామారావు, గోలి వెంకటేశ్వరులు
నిర్మాణం : చదలవాడ బ్రదర్స్
నిర్మాత : చదలవాడ పద్మావతి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం : చదలవాడ శ్రీనివాసరావు
పి ఆర్ ఓ : మధు VR