Big Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ తెలుగు.. ముగ్గురు కంటెస్టెంట్స్ ఫిక్స్.. ఎవరో తెలుసా?

Big Boss OTT: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ముగిసిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈ రోజు మరొక రెండు నెలల్లో బిగ్ బాస్ తీసుకొస్తున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ త్వరలో మొదలు కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు ఎపిసోడ్స్ వస్తుంటాయి. ఏడు వారాల పాటు సాగే ఈ ఓటీటీ బిగ్ బాస్ హౌస్ లోకి 10 నుంచి 12 మంది కంటెస్టెంట్స్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో ని అమితంగా ప్రేమించే బిగ్ బాస్ ప్రేమికులు బిగ్ బాస్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక నాగార్జున చెప్పిన విధంగానే 2022 ఫిబ్రవరిలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ రాబోతోందని సమాచారం. బిగ్ బాస్ తెలుగు ఓటిటీ కోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయడం కూడా మొదలయింది అని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్ లను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కోసం బుల్లితెర యాంకర్ వర్షిని ని కంటెస్టెంట్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరొక కంటెస్టెంట్ యూట్యూబ్ శివని ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మూడవ కంటెస్టెంట్ గా ఢీ షో ఛాంపియన్ రాజుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ ముగ్గురు కంటెస్టెంట్ లు ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ జరిగిన అదే హౌస్ సెట్ లో త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ ఓటీటీ కూడా ఉంటుంది అని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 కోసం మార్చనున్నారు.కానీ ఇప్పుడు ప్రసారం అయ్యేది బిగ్ బాస్ ఓటీటీ కావడంతో బిగ్ బాస్ సీజన్ 5 లో కొద్దిపాటి మార్పులు చేసినట్లు సమాచారం. హోస్ట్ గా నాగార్జున వ్యవహరించబోతున్నారు అని తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఇప్పటి వరకు స్టార్ మా లో ఎంటర్ టైన్ చేసిన బిగ్ బాస్ షో ఓటీటీ లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.