Bigg Boss OTT Non Stop: రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Bigg Boss OTT Non Stop: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా స్ట్రీమింగ్ అవుతూ మరింత ప్రేక్షకాదరణ దక్కించుకుని 24 గంటల పాటు ప్రసారం ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమం గత నెల 26వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా 17 మంది కంటే స్టెంట్లతో ప్రారంభమైంది.ఇక 17మంది కంటెస్టెంట్ లతో గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.

ఇక ఈ 16మంది కంటెస్టెంట్ లో భాగంగా ఈ వారం 11 మంది నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో సీనియర్లు ఏడు మంది నామినేషన్ లో ఉండగా జూనియర్లు నలుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే ఈ విషయంపై ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర ఉత్కంఠత నెలకొనివుంది. అయితే లీకు రాయుల్ల పుణ్యమా అని ఒక రోజు ముందుగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరు మనకు తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా బిగ్ బాస్ నుంచి బయటకు ఎవరు వెళ్తున్నారు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండవ వారంలో భాగంగా ఏకంగా పదకొండు మంది కంటెస్టెంట్ లో నామినేషన్ లో ఉన్నారు. వీరిలో శ్రీరాపాక, అనిల్ రాధోడ్‌, మిత్ర శర్మ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ముగ్గురిలో ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే.. వీరిలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీరాపాక ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి క్లారిటీ తెలియాలంటే మరి కొంత సమయం పాటు వేచి చూడాలి.