బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంత ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికి ఈ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లలో పూర్తి చేసుకొని ఆరవ సీజన్ కి సిద్ధమవుతోంది. అదేవిధంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ కార్యక్రమం ఓటీటీలో విడుదలయ్యి తాజాగా ఈ కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నారు. ఇకపోతే సీజన్ సిక్స్ కార్యక్రమానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటికే కంటెస్టెంట్ గా ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిగా తదుపరి సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రసారం కాబోయే సీజన్ సిక్స్ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం లేదని ఈయన వ్యాఖ్యాతగా తప్పుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి పలు వివాదాలే కారణమని తెలుస్తోంది.
గతంలో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో ఎంతోమంది ఆయన వ్యవహార శైలిని తప్పుబడుతూ పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.నాగార్జున తప్పు ఒప్పులు తెలుసుకోకుండా ఒకే ధోరణిలో మాట్లాడుతున్నారని కేవలం నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతారని పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ లు వ్యవహరించే శైలిని తప్పుబడుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమం ప్రసారం పై రాజకీయ నాయకుల ఒత్తిడి కూడా అధికంగా ఉంది. అందుకే ఇలాంటి వివాదాల నడుమ నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాలా..వద్దా అనే విషయం గురించి సుదీర్ఘ ఆలోచన చేసిన అనంతరం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.