Bigg Boss Non Stop: రాయలసీమ యాసతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న నటుడు మహేష్ విట్టా. ఫన్ బకెట్‌తో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా ఆఫీస్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసి.. ప్రస్తుతం తానే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు తీసే రేంజ్‌కి ఎదిగారు మహేశ్. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను.. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ ఓటీటీ ద్వారా రెండో సారి బిగ్ బాస్ షోకి వెళ్లారు. అయితే బిగ్ బాస్‌కి వెళ్లడానికి ముందు మహేశ్ విట్టా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ తన లవ్ స్టోరీని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నాలుగేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. నాకు లవ్ గురించి పెద్దగా ఏమీ తెలియదు గానీ, ఆ అమ్మాయి తనతో ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుందని మహేశ్ తెలిపారు. ఎంత గొడవపడినా కూడా నిమిషాల్లో మళ్లీ కలిసిపోయి హ్యాపీగా ఉంటామన్న మహేశ్, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ ఓ శుభవార్తను అభిమానులను చేరవేశాడు.
ఇకపోతే ఆ అమ్మాయి తన చెల్లెలి స్నేహితురాలని, ఐటీ ఉద్యోగం చేస్తోందని మహేశ్ చెప్పారు. ఆమెను చూడగానే తన అమ్మ ఫేస్‌లాగే అనిపించడంతో వెంటనే వెళ్లి ప్రపోజ్ చేశానని ఆయన అన్నారు. అప్పుడు తాను రిజెక్ట్ చేయడంతో కొన్ని రోజులు ఫ్రెండ్స్‌గానే ఉన్నామని, ఆ తర్వాత రెండేళ్లకు తన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో లైన్ క్లియర్ అయిందని మహేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక పెళ్లికి కూడా తామిద్దరి ఇంట్లోనూ ఓకే చెప్పారన్న మహేశ్, తన సొంత ప్రొడక్షన్స్‌లో వస్తున్న సినిమా రిలీజ్ కాగానే ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఓటీటీకి కంటెస్టెంట్‌గా వెళ్లిన మహేష్ విట్టా.. ఈసారి ఎలాగైనా కప్పుకొట్టాలనే కసితో వెళ్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.