టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ గత వారం రోజులుగా మీడియాలో హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ పెద్దల భేటీ పై బాలయ్య సంచలన ఆరోపణలు చేయడంతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పుడిప్పుడే ఆ వాతావరణం చల్లబడుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఇండస్ర్టీపై బాలయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోయాయ ని ఆరోపించారు. అసలు రాజకీయాలు కన్నా కుల రాజకీయాలు ఇప్పుడు పరిశ్రమని ఏలుతున్నాయని మండిప్డడారు.
పరిశ్రమలోనే కొందరు గ్రూపులు కట్టి రాజకీయాలు చేయడం రోజు రోజుకి ఎక్కువైపోతుందన్నారు. పాత కాలం రోజుల్లోనే ఇలాంటి రాజకీయాలు నడవలేదని కాదు…అప్పుడు తక్కువ…ఇప్పుడు మాత్రం అదే పనిగా ఇండస్ర్టీ నడుస్తుందన్నారు. అలాగే ఇండస్ర్టీ ఏ ఒక్కరిదో కాదు. అందరిది. ఇక్కడకి ఎవరైనా రావొచ్చు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బాలయ్యకు ఎవరు చెప్పలేదన్నారు. దీంతో బాగా హర్ట్ అయ్యానన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైనట్లు తెలిసింది. ఈ విషయం కూడా తనకు తెలియదన్నారు.
జూన్ 10 నా బర్త్ డే కాబట్టి బాలకృష్ణ రారు అని నా మాటగా వాళ్లే ముందు చెప్పేసారు. అలా ఎలా చెబుతారు? ఆ రైట్ వాళ్లకి ఎవరిచ్చారు? ఎవరిష్టానుసారం వారు వ్యవరిస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేసారు. అలాగే విశాఖలో సినిమా ఇండస్ర్టీ డెవలప్ మెంట్ కి తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడు రాయి పడిందన్నారు. ఎఫ్ డీసీలో తొలి అప్లికేషన్ ఇచ్చింది బాలయ్యే అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వద్దకు ఏ టాలీవుడ్ పెద్ద అప్పుడు వచ్చి కలిసింది లేదన్నారు. వాళ్లు రానప్పుడు ఆయనేం చేస్తారు? అన్నట్లు బాలయ్య మాటల ద్వారా బయట పడింది. మరి తాజా వ్యాఖ్యలు పరిశ్రమలో ఇంకెంత దుమారం రేపుతాయో.