Balakrishna: బాలకృష్ణ యాడ్స్ లో నటించక పోవడం వెనుక ఇంత స్టోరీ ఉందా!

Balakrishna: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకవైపు ఈ సినిమా ద్వారా సంపాదిస్తూనే మరొకవైపు పలు రకాల యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక రెండు చేతుల సంపాదిస్తూ కొంతమంది సెలబ్రెటీలు భూములను, ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంకొంతమంది వారి వ్యక్తిగత బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే సినీ ఇండస్ట్రీలోనే పెట్టుబడులు పెడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాల ద్వారా కంటే ఇతర ఆదాయాల ఎక్కువగా కలిగి ఉన్నారు.

వీరిలో ఉదాహరణకు మహేష్ బాబు ఏడాది 50 కోట్ల రూపాయలను సినిమాల ద్వారా సంపాదిస్తే, కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ అంతకుమించి ఆదాయాన్ని తగ్గించుకుంటున్నారు. కేవలం మహేష్ బాబు మాత్రమే కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. మిగిలిన హీరోలు కూడా ఒకటి రెండు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కొందరు హీరోలు ఒక్క కమర్షియల్ యాడ్ కూడా చేయలేదు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ కు 1990 లో పలు కమర్షియల్ యాడ్స్ ప్రపోజల్ రాగా, అప్పటికే టాలీవుడ్ టాప్ హీరో అయిన బాలకృష్ణకు కోట్ల పారితోషికాన్ని ఇచ్చేందుకు కంపెనీ ముందుకు వచ్చిందట. అప్పుడు బాలయ్య మాత్రం కమర్షియల్ యాడ్స్ చేసే ఉద్దేశం లేదని చెప్పేశాడట.

ఆ తర్వాత ఎన్నో పెద్దపెద్ద కంపెనీలు వారి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించమని బాలయ్యను కోరినప్పటికీ, బాలకృష్ణ ఒక్క బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. కోట్ల పారితోషికం కూడా వద్దన్న బాలయ్య జనాలను మోసం చేయడం ఇష్టం లేక ఆ ప్రచార వీడియోలు నటించేందుకు నో చెప్పాడు అన్నది సన్నిహితుల మాట. ఏదైనా ఒక ఉత్పత్తి గురించి మాట్లాడాలి అంటే అందులో నూరుశాతం నిజం ఉండదు.. అందువల్లే జనాలను మోసం చేస్తూ డబ్బు సంపాదించడం ఇష్టం లేకపోవడం వల్ల బాలయ్య తన కెరీర్లో ఎప్పుడూ కానీ కమర్షియల్ యాడ్స్ లో నటించలేదు.