AP Ticket Rates Issue : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో థియేటర్స్ వ్యవస్థకి ఏ స్థాయిలో దెబ్బ పడిందో చూస్తూనే ఉన్నాం. దీనితో అటుపక్క సినీ ఇండస్ట్రీ కి కూడా తీరని నష్టం ఆల్రెడీ మొదలైంది. హిట్ టాక్ వచ్చిన పలు భారీ సినిమాలే నష్టాలు చూడక తప్పడం లేదు. దీనితో ఆల్రెడీ ఎవరూ ముందుకు రాని పక్షంలో పవన్ కళ్యాణ్ నే ముందు స్పందించి తమ ఇండుస్ట్రీ ని వదిలెయ్యాలని తెలిపాడు.
అయినా అప్పటికి పవన్ రేంజ్ లో కనుకున్నా మెగాస్టార్ చిరంజీవి తన శైలిలో పలుమార్లు ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. కానీ నాచురల్ స్టార్ నాని మాత్రం తాను అనుకున్నదానిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో అక్కడ నాని హైలైట్ అయ్యాడు. కానీ ఇంకా మిగతా పెద్ద హీరోలు ఎవరూ ఈ సమస్యపై స్పందించలేదు కానీ ఇప్పుడు నాని తర్వాత మరో యువ హీరో అయినటువంటి నిఖిల్ స్పందించాడు.
సినిమా థియేటర్స్ అంటే తనకి దేవాలయాలు లాంటివి అని అలాంటిది ఇప్పుడు ఆ థియేటర్లు మూతపడిపోవడం చూస్తూ ఉంటే మనసు ముక్కలవుతుందని తెలిపాడు. ట్రైన్స్ లో ఎలా అయితే కొన్ని విభాగాలకు రేట్లు ఉంటాయో అలాగే థియేటర్స్ లో సరైన ధరలు ఉండాలని కానీ 20 రూపాయలు లాంటి ధరలు కాదని సూచించాడు.
అలాగే ఇంకో పక్క తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీ కోసం అలోచించి తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే మంచి పరిష్కారం చూపిస్తారని అనుకుంటున్నట్టుగా తెలిపాడు. ఎంతసేపు ఈ యువ హీరోలే మాట్లాడుతుంటే ఇక మన పెద్ద హీరోలు ఏమయ్యిపోయారు అని నెటిజన్స్ మండిపడుతున్నారు.