ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరొక సరికొత్త రికార్డ్..హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో నామినేట్..!

దర్శక వీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అంతేకాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల మరొక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్లో నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మీడి సీజన్స్ అవార్డ్స్ 2022లో ఎంపికై హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి ఈ అవార్డ్స్ లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఈ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో ఆర్అర్ఆర్ రెండవ స్థానం దక్కించుకొని రన్నరప్ గా నిలువగా.. ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మొదటి స్థానం దక్కించుకుంది. ఇలా క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో నిలవడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్ స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ,ఎన్టీఆర్ తమ తదుపరి సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ఇప్పటికె శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా తొందర్లోనే షూటింగ్ మొదలుకానుంది.