Raviteja Khiladi : బిగ్ అప్డేట్ : “పుష్ప” తర్వాత తెలుగు సినిమాగా రెడీ అయిన “ఖిలాడి”

Raviteja Khiladi : ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా దగ్గర మన టాలీవుడ్ సినెమాలు డామినేషన్ కనబడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు ఎంతలా ఆరాధిస్తారో బాహుబలి తర్వాత అందరికీ క్లియర్ అయ్యింది. మంచి కంటెంట్ అండ్ ప్రమోషన్స్ పట్టుకెలితే భారీ వసూళ్లు కూడా అందిస్తారు వారు.

మరి ప్రమోషన్స్ లేకుండానే వెళ్లి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా 100 కోట్లు హిందీలో కొల్లగొట్టాడు. ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ హిందీలోకి మన తెలుగు సినిమా ఏది వెళ్ళలేదు. కానీ ఇపుడు మాస్ మహారాజ్ రవితేజ తన “ఖిలాడీ” సినిమాతో హిందీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

ఈ బిగ్ అనౌన్సమెంట్ ని “RRR” సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్న భారీ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ వారు తెలిపారు. ఖిలాడి సినిమాని వారు కూడా తెరకెక్కించగా ఇప్పుడు ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో రవితేజ ఫాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించగా ఇద్దరు హీరోయిన్స్ రవితేజ సరసన నటించారు. అలాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా వచ్చే మార్చ్ 11న తెలుగు మరియు హిందీలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుంది.