Morning Tea : టీతో పాటు ఈ పదార్థాలు తింటున్నారా.. జర జాగ్రత్త..!

Morning Tea ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే కొద్దిమందికి రోజు గడవదు. టీ తాగడం వల్ల మన మెదడు రిఫ్రెష్ అవుతుంది. ఈ క్రమంలోనే ఉదయం లేవగానే ఒక కప్పు చాయ్ తాగనిదే ఏ పని మొదలు పెట్టము. అయితే చాలామంది కేవలం టీ మాత్రమే కాకుండా టీ లోకి బిస్కెట్స్, బ్రెడ్ వంటి వాటిని తింటూ ఉంటారు. కానీ టీ తాగే టప్పుడు కొన్ని రకాల పదార్థాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సమస్యలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం… బిస్కెట్స్ మాత్రమే కాకుండా ఈ ఆహారపదార్ధాలు తింటే ఎన్ని సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మొలకెత్తిన విత్తనాలు ఉదయమే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మొలకెక్కిన విత్తనాలు తినడం వల్ల బరువు తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విత్తనాలలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఉదయమే టీ తాగుతూ వీటిని తినటం లేదా మొలకెత్తిన విత్తనాలు తిన్న వెంటనే టీ తాగటం వల్ల ప్రమాదం. మొలకెత్తిన విత్తనాలలో ఫైటేట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన మొలకెత్తిన విత్తనాలు తింటూ టీ తాగకూడదు.

పచ్చి ఆకు కూరలు మరియు కూర కాయలు ఉదయమే తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ వంటి ఎన్నో పోషక విలువలు ఉంటాయి.పచ్చి ఆకు కూరలు మరియు కూరగాయలు తింటూ టీ తాగటం చేయకూడదు. ఇలా చేయడం వల్ల అయోడిన్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే టీ తో పాటు చాలా మందికి బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది టీతో పాటు బిస్కెట్లు తినకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.