రోడ్డు పక్కన టీ తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. క్యాన్సర్ తో పాటు అలాంటి సమస్యలు వస్తాయట!

మనలో చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే ఎంతో ఇష్టంగా టీ తాగుతారు. టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరుతాయి. నిద్రలేచిన వెంటనే టీ తాగడం వల్ల చురుకుగా పని చేసే అవకాశాలు ఉంటాయి. తక్కువ ధరకే టీ లభిస్తుండటంతో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది టీ ఇష్టంగా తాగుతారు. నగరాల నుంచి పల్లెటూళ్ల వరకు టీ బిజినెస్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.

టీ బిజినెస్ చేసి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్న వాళ్లు సైతం ఉన్నారు. నగర శివార్లలో సైతం టీ స్టాళ్లను ఏర్పాటు చేసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. టీ బిజినెస్ ఎలాంటి నష్టం లేని బిజినెస్ అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కూర్చోవడానికి అనువుగా వసతులు కల్పిస్తుండటంతో ఈ బిజినెస్ లో ప్రముఖ వ్యాపారులు సైతం పెట్టుబడులు పెడుతుండటం గమనార్హం.

అయితే రోడ్డు పక్కన టీ స్టాళ్లలో ప్లాస్టిక్ గ్లాసులలో టీ తాగితే మాత్రం లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని చెప్పవచ్చు. ప్లాస్టిక్ కప్పుల తయారీ కోసం ప్రమాదకరమైన కెమికల్స్ ను వినియోగించడం జరుగుతుంది. ప్లాస్టిక్ కప్పులలో టీ తాగితే ప్రమాదకరమైన రసాయనాలు మన శరీరంలోకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. పదేపదే ఆ ప్లాస్టిక్ కప్పులను వాడితే ప్రమాదం మరింత పెరుగుతుంది.

ప్లాస్టిక్ కప్పులలో తరచూ టీ తాగేవాళ్లకు గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్లాస్టిక్ కప్పుల వల్ల పిల్లలకు ప్రమాదం మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా గాజు గ్లాస్ లను, మట్టి కుండతో చేసిన గ్లాస్ లను, స్టీల్ గ్లాస్ లను వినియోగిస్తే మంచిదని చెప్పవచ్చు.