ఎవరైతే ఎక్కువగా కారం తింటారో వాళ్లు అల్సర్ బారిన పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో మ్యూకస్ పొర దెబ్బ తిన్నా, పెద్దపేగు లోపలి లైపు వాపు వచ్చినా ఆ లక్షణాలను అల్సర్ లక్షణాలుగా గుర్తించాలి. డీ హైడ్రేషన్, కాలేయ సంబంధిత సమస్యలు, రక్త విరేచనాలు, ఆకలి లేకపోవడం, అలసట, జ్వరం, రక్తహీనత, బరువు తగ్గడం లాంటి లక్షణాలు అల్సర్ లక్షణాలు అని చెప్పవచ్చు.
కొంతమందికి జన్యుపరంగా కూడా అల్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అల్సర్ సమస్యతో బాధ పడేవాళ్లు టీ, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది. సిగరెట్ తాగడం, కారం మసాలాలు ఉన్న ఆహారం తీసుకోవడం చేయకూడదు. పాలు, పెరుగు, చీజ్, స్వీట్లకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటే మంచిది. రాత్రి సమయంలో నూనె పదార్థాలకు బదులుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
అల్సర్ సమస్యతో బాధ పడేవాళ్లు డీ హైడ్రేషన్ కు గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరిగించి వడబోసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అరటి, ఆరెంజ్, ద్రాక్ష, ఇతర పండ్లను తీసుకోవడం ద్వారా త్వరగా అల్సర్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల తక్కువ సమయంలో అల్సర్లు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహారాలకు మాత్రం అల్సర్ సమస్యతో బాధ పడేవాళ్లు దూరంగా ఉండాలి. క్యారెట్లు, అవిసె గింజలు, పుట్టగొడుగులు, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అల్సర్ సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.