బాలీవుడ్ లో ఒక లక్ష్యంతో అడుగుపెట్టి.. ఆ లక్ష్యంతోనే సినిమా నిర్మాణంపై దృష్టి సారించిన వ్యక్తి అజయ్ సింగ్ రాజపుత్. ఆయన నిర్మాతగా తాజాగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ చిత్రం పేరు ‘రెబెల్ ఆఫ్ ది నాని’. ఒక భాషలో చిత్రం నిర్మించాలంటే ఎంతో వ్యప్రయాసలతో కూడుకున్న పని. అలాంటిది ఐదు భాషలు అంటే మామూలు విషయం కాదు. హిందీలో ‘తేరే ఇష్క్ కా ఏ జునూన్ హై ..’ అంటూ నవ యువతరంపై సందేశాత్మకంగా ఓ చక్కటి ప్రేమకథ తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో ప్రఖ్యాత మోడల్, బాలీవుడ్ నటి నీతాశర్మ ప్రధాన పాత్రని పోషిస్తోంది. నీతాశర్మ మోడల్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత సినిమా రంగంపై అడుగు పెట్టింది. ఈమెకు నటిగా బాలీవుడ్ లో చక్కటి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తోనే అజయ్ సింగ్ రాజపుత్ నిర్మిస్తున్న చిత్రంలో ప్రధాన భూమికను పోషిస్తోంది. ఈ క్యారెక్టర్ తనకు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మంచి పేరును తెచ్చిపెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత అజయ్ సింగ్ రాజపుత్ మీడియాతో మాట్లాడుతూ ”రాజపుత్ ఫిలిం ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాల నిర్మాణం ఉంటుంది. నా సినీ ప్రయాణం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ద్విగ్విజయంగా సాగించలనుకుంటున్నా. ప్రస్తుతం నేను ఈ ఐదు భాషల్లో చేస్తోన్న సినిమాలు ఆద్యంతం ప్ర్క్షకులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటాయి. సినిమా నిర్మాణం అనేది రంగుల ప్రపంచం అయినప్పటికీ ఆ రంగుల్లోనే భవిష్యత్తును వెతుక్కోవాలనే ఆరాటం నాది.
పెడదోవ పడుతన్న నేటితరాన్ని సక్రమమైన మార్గంలో నడిచేలా నా చిత్రాలు మార్గ నిర్దేశనం చేస్తాయి. ఆ దిశగానే నా సినిమా ప్రయాణం ఉంటుంది. మంచి చిత్రాల నిర్మాణమే నా లక్ష్యం. ఈ భాష, ఆ భాష అంటూ ఎదో ఒక భాషకే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు నిర్మించాలన్నదే నా ముందున్న కర్తవ్యం. ఆ దిశగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ముందుకు సాగాలన్నదే నా తపన. బాలీవుడ్ లో ప్రస్తుతం ఒకే మూసలో సినిమాల నిర్మాణం జరుగుతున్నది. ప్రేక్షకులు వాటిని అంతగా ఆస్వాదించలేక పోతున్నారన్నది నేను గమనించాను.
ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తాలంటే దానికి అనువైన కథ దొరకాలి. ఆ కథను అంతే జనరంజకంగా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దిన సినిమాలే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని రంజింప చేస్తాయి” అని పేర్కొన్నారు.
‘తేరే ఇష్క్ కా ఏ జునూన్ హై ..’ చిత్రానికి సంబంధించి
దర్శకత్వం : జీవం యశ్వంత్, ముఖేశ్ జా సంగీతాన్ని సమకూరుస్తుండగా,
ఫైట్స్: ముఖేష్,
కాస్టింగ్ : గుల్జార్ బాస్,
నిర్మాత: అజయ్ సింగ్ రాజపుత్,
సహ నిర్మాత : రాహుల్ శాండిల్య,
రచన : విపిన్ ప్రజాపతి,
డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: చందన్ కె. పండిట్-దినేష్ కనోజియా (డి.కె) అందిస్తున్నారు.