రేపో మాపో ఎన్నికలు.. ఇదీ దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. 2024 మార్చి – ఏప్రిల్ – మే నెలల్లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు వచ్చే నెలలోనో.. ఆ పై వచ్చే నెలలోనే జరుగుతాయేమోనన్నంత సందడి కనిపిస్తోంది.
ఓ వైపు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతోంటే, ఇంకో వైపు ‘ఇండియా’ తెరపైకొచ్చింది. ఇక్కడ ఇండియా అంటే భారతదేశం కాదు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలియన్స్. ఈ ‘ఇండియా’ కూటమికి కాంగ్రెస్ పార్టీ సారధ్యం వహించనుంది.
కాంగ్రెస్ భావి ప్రధానిగా చెప్పబడుతున్న రాహుల్ గాంధీ ఈ ‘ఇండియా’ పేరుని ప్రకటించారు. బీజేపీయేతర రాజకీయ పార్టీలు చాలావరకు ఈ కొత్త ‘ఇండియా’ కూటమిలో వుండనున్నాయి.
ఇంతకీ, భారత్ రాష్ట్ర సమితి.. అదేనండీ, కేసీయార్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పరిస్థితేంటి.? అటు ఎన్డీయే వైపు వెళ్ళదు.. ఇటు ఇండియా కూటమి వైపూ బీఆర్ఎస్ చూడదట.! బీఆర్ఎస్, జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఎదుగుతుందట. కానీ, ఎలా.?
బీఆర్ఎస్తో జత కడ్తాయని చెప్పబడుతున్న చాలా పార్టీలు ‘ఇండియా’ కూటమి వైపుకు వెళుతున్నాయి. దాంతో, బీఆర్ఎస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఇంతకీ, ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్ పాత్ర ఎంత.?
రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ‘ఇండియా’ కూటమి పార్టీలు అంగీకరిస్తాయా.? ప్చ్.. ప్రస్తుతానికైతే ముందస్తు సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగానే అంచనాలేస్తున్నాయ్. సో, ‘ఇండియా’ కూటమి.. నిలబడటం అంత తేలిక కాదు.!