దేశంలో ఏదో జరుగుతోంది.! ఏం జరుగుతోందన్నదానిపై ఎవరికీ సరైన అవగాహన కుదరడంలేదు.! కొన్ని విషయాల్ని దేశమంతా స్వాగతిస్తోంది. కొన్ని విషయాల్ని దేశమంతా వ్యతిరేకిస్తున్నా.. అవి ముందుకు వెళుతూనే వున్నాయ్.!
కొత్త సాగు చట్టాలంటూ గతంలో మోడీ సర్కారు చేసిన హంగామా బెడిసి కొట్టింది. కాశ్మీర్ విషయంలో, మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైంది.! వన్ నేషన్.. వన్ ఎలక్షన్ వ్యవహారం తెరపైకొచ్చింది కొత్తగా. ఇంతలోనే, ఇండియా కాదు.. భారత్ అనే కొత్త వాదన ప్రచారంలోకి వచ్చింది.
ఎటు చూసినా.. నరేంద్ర మోడీ.! ఓన్లీ మోడీ.! ఆ సేతు హిమాచలం.. నరేంద్ర మోడీ మాత్రమే.! దేశంలో పన్నుల మోత మోగిపోతోంది. పెట్రో ధరలు తగలబడిపోతున్నాయ్.. వంట గ్యాస్ భగ్గుమంటోంది.! అయినా, ఓన్లీ మోడీ.. ఓన్లీ నరేంద్ర మోడీ.!
వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ దిశగా కేంద్రంలోని మోడీ సర్కారు కీలకమైన ముందడుగు వేయబోతోంది. ఆ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. చర్చ కాదు, రచ్చ షురూ అయ్యింది. దానికి విరుగుడుగా ఇండియా కాదు.. భారత్ అనే అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు.
పార్లమెంటులో రెండు బిల్లులూ ఒకేసారి పెడతారా.? ఏమో, పెడతారేమో.! బిల్లులు పెడితే పనైపోతుందా.? ఏమో, అయిపోతుందేమో.! రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దు జరిగిపోలేదూ.! అలాగే, ఇండియన్స్ అంతా, తెల్లారేసి సరికి.. జస్ట్ భారతీయులైపోతారంతే.!
ఎవరితోనూ సంప్రదింపులు అవసరంలేదు.. మంచీ చెడూ మాట్లాడే ప్రసక్తి అసలే లేదు. నరేంద్ర మోడీ.. ఓన్లీ నరేంద్ర మోడీ.! ఎనీ డౌట్స్.? నో ఛాన్స్.!