KGF2: కేజిఎఫ్ సినిమాలో యశ్ తల్లి వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… మరీ అన్ని సంవత్సరాలు చిన్నదా?

KGF – 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన సినిమా కేజిఎఫ్ 2 . కేజిఎఫ్ సినిమాకి సీక్వెల్ గా తీసిన ఈ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కేజిఎఫ్ సినిమా కూడా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా విడుదలైన కేజిఎఫ్ 2 సినిమా వారంలోనే దాదాపు 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటివరకు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఒకే ఒక్క సినిమాతో ఈ సినిమా డైరెక్టర్, హీరో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన అర్చన్ జోయిస్ వయసు గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. కేజిఎఫ్2 సినిమా ద్వారా అర్చన మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. సినిమా హీరో యష్ కన్న అర్చన జోయిస్ 9 సంవత్సరాలు చిన్నది ఇప్పుడు ఆమె వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా మంచి హిట్ అవటంతో అర్చన జోయిస్ కి రోజు రోజుకి ఆఫర్లు పెరిగిపోతున్నాయి. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూ మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి మంచి పాత్రలు చేస్తూ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

అర్చన జోయిస్ ఈ సినిమాలో ట్రెడిషనల్ గా కనిపించిన బయట మాత్రం ఆమె చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం అర్చన జోయిస్ కి సంబంధించిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అర్చన తన నటనతో మాత్రమే కాకుండా అందం తో కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అర్చన కి తెలుగులో కూడా మంచి ఆఫర్స్ రావాలని తెలుగు ఆడియెన్స్ కోరుకుంటున్నారు.