Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో నాగశౌర్య నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయాడు నాగశౌర్య. ఆ తర్వాత సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేక పోయాయి. గత నాలుగైదు ఏళ్లగా నాగశౌర్యకు పెద్దగా కలిసిరావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని జానర్లు మార్చినా కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.
ఏ సినిమా చేసినా ఈ హీరోకి పెద్దగా కలిసి రావడంలేదు. అంతే కాదు నాగశౌర్య సినిమా అంటే పెద్దగా ఇట్రెస్ట్ చూపించడంలేదు జనాలు. పాన్ ఇండియా సినిమాలు కానీ, లో బడ్జెట్ సినిమాలలో కథ బాగున్న బలగం లాంటి సినిమాలకు మాత్రమే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, హిట్స్ తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం సినిమాలు లేక చేసిన సినిమాలు హిట్ అవ్వక సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం లైమ్ లైట్ లో పెద్దగా కనిపించడం లేదు. చివరిగా రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఈ సినిమాతో కూడా దారుణమైన డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. రీసెంట్ గా పెళ్ళి చేసుకున్న నాగశౌర్య ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
అయితే నాగశౌర్యకు సబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాగశౌర్య గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు హీరో అమ్మ ఉషా. ఈ సందర్భంగా కీలక విషయాలు ఆమె వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఉషా.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నాగశౌర్య గురించి ఇంటర్వ్యూలు అడగ్గా ఆమె ఎమోషనల్ అయింది. ప్రస్తుతం నాగశౌర్య తన దగ్గర లేడన్న నిజాన్ని బయట పెట్టింది. చిన్నప్పటి నుంచి వాడికి పెళ్లి వరకు నీతో ఉంటాను పెళ్లయిన తర్వాత దూరంగా వెళ్ళిపోతానని అన్నారు. అనుకున్నట్లుగానే వేరు పెళ్లి అవ్వగానే వేరేగా ఫ్యామిలీని పెట్టి దూరంగా ఉంటున్నారని ఆమె చెప్పింది. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తారు అంతేతప్ప వాళ్ళు మా దగ్గర లేదని బాధ మాకు అలానే ఉందని ఆ ఇంటర్వ్యూలో ఉషా అన్నారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నాగశౌర్య తల్లికి దూరంగా ఉన్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటీజన్స్.