నెగెటివ్‌ రివ్యూస్‌ రావడంతో తెలుగులో రిలీజ్‌ పై అనాసక్తి!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగువారిని తన అభిమానులుగా చేసుకున్న విజయ్‌.. ఆ సినిమా తరువాత తన అన్ని సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నాడు.

ఇక ఈ మధ్యనే ఆయన ఇంట్లో పెద్ద విషాదం జరిగిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఒత్తిడికి లోనైనా ఆమె.. ఇలాంటి షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. కూతురు చనిపోవడంతో విజయ్‌ ఎంత కృంగిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు చనిపోయిన తర్వాత విజయ్‌ ఒక కీలక నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే.

ఇక కూతురు చనిపోయిన వారం రోజులకే విజయ్‌ మీడియా ముందుకు వచ్చి తన సినిమాకు ప్రమోషన్స్‌ మొదలుపెట్టి షాక్‌ ఇచ్చాడు. ఆ సినిమానే రత్తం. సీఎస్‌ ఆముదన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కూతురు చనిపోయిన బాధలో ఉన్నా కూడా.. సినిమాకు ప్రమోషన్స్‌ చేశాడు విజయ్‌. ఇక తమిళ్‌ లో రిలీజ్‌ అయిన మూడు రోజులకు తెలుగులో కూడా రిలీజ్‌ చేయాలనీ అనుకున్నారు.

కానీ, కొన్ని కారణాల వలన ఆ పని చేయలేకపోయారు. ఇక ఇప్పుడు అసలు అవసరం లేదని అనుకుంటున్నారట. తమిళ్‌ లో ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని, నెగెటివ్‌ రివ్యూస్‌ రావడంతో తెలుగులో రిలీజ్‌ చేసి అనవసరంగా డబ్బులు వేస్ట్‌ చేయించడం ఎందుకని మేకర్స్‌ భావిస్తున్నారని టాక్‌ నడుస్తుంది.

కూతురు చనిపోయిన బాధలో ఉన్న విజయ్‌ ఆంటోనీకి రత్తం సినిమా కొంతలో కొంత అయినా రిలాక్స్‌ ను ఇస్తుందని ఆయన అభిమానులు భావించారు. కానీ, అది కూడా కుదరలేదు.. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్‌ కాకపోవడంతో విజయ్‌ ఫాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.