నూతన దంపతుల ఒత్తిడి సమస్యలపై చిత్రం!

కొత్తగా వివాహమైన దంపతులు ఎదుర్కొంటున్న సంతానోత్పత్తి, మానసిక ఒత్తిడి సమస్యలకు పరిష్కార మార్గం చూపే చిత్రంగా ‘వెప్పం కులిర్‌ మళై’ తెరకెక్కింది. ‘కుట్రం కడిదల్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టరుగా జాతీయ అవార్డును అందుకున్న ఫాస్కల్‌ వేదముత్తు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. నిర్మాత ధీరవ్‌ ఇందులో హీరోగా నటించడమే కాకుండా, నిర్మాతగా వ్యవహరించారు. ఇస్మత్‌ బాను హీరోయిన్‌. సీనియర్‌ నటుడు ఎం.ఎస్‌. భాస్కర్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ సినిమా వివరాలను దర్శకుడు వెల్లడించారు.

ఫాస్కల్‌ వేదముత్తుమాట్లాడుతూ… బాహ్య, సామాజిక అంశాలు మానసిక, శారీరక అస్థిరతకు దారి తీస్తాయనే అంశాన్ని ప్రధానంగా ఇందులో చూపించాం. ఈ మూవీ సింహభాగం మానవ సంబంధాలు, భావోద్వేగాలను అన్వేషించేలా సాగుతుంది. ‘అసురన్‌’ చిత్రంలో ఇస్మత్‌ బాను ఒక పాటలో కనిపించినప్పటికీ ఆమె నటన ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు. సీనియర్‌ నటుడు ఎంఎస్‌ భాస్కర్‌ పాత్ర చాలా బాగా వచ్చింది. అత్తగారి పాత్రను నటి రమ పోషించారు. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నామని తెలిపారు.