పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2024 కి ఉండదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా రాష్ట్ర రాజకీయాల గురించి స్పందిస్తూ అధికారపక్షాన్ని నిలదీస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయనకు రాజకీయ జీవితం లేదని వెల్లడించారు. అయితే ఈ విషయాలన్నింటిని బయటపెడితే తనకు ప్రమాదం ఉంటుందని తనకు తెలుసని అయితే అలాంటి బెదిరింపులకు తాను భయపడనని తను జీవితంలో జరగబోయే సత్యాలనే వెల్లడిస్తానని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ జాతకంలో అతనికి రాజకీయ యోగం లేదని 2024 వ సంవత్సరానికి తన పార్టీ పూర్తిగా మూసేస్తారని ఈ సందర్భంగా వేణుస్వామి తెలిపారు.

పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు సినిమాలు కొన్ని రోజులు రాజకీయాలంటూ తిరుగుతున్నారని అయితే ఆయన పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి పరిమితమయ్యారని చెప్పడంతో కొందరు ఈయన వ్యాఖ్యలను గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే గతంలో సమంత నాగచైతన్య విషయంలో ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. అదేవిధంగా ఈ సారి ఎన్నికలలో భాగంగా టిడిపి అధికారంలోకి రాదని జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పినట్టుగానే జరిగాయని పలువురు భావిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో కూడా జగన్ ముఖ్యమంత్రిగా గెలుస్తారని ఆ తర్వాత మరో పది సంవత్సరాల పాటు కూడా జగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.