లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ మాసివ్ చిత్రం “వీరసింహా రెడ్డి”. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ ఎత్తున ఓపెనింగ్స్ అందుకునేలా రికార్డు బుకింగ్స్ ఆలోవర్ వరల్డ్ నమోదు చేస్తూ సెన్సేషనల్ రిలీజ్ అయ్యింది.
మరి ఇన్ని అంచనాలు ఉన్న ఈ చిత్రం అయితే బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలుస్తుందని ఆల్రెడీ టాక్ ఉండగా ఈ సినిమా రిలీజ్ తో అయితే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్ ని అయితే పాపులర్ స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ వారు అయితే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది.
దీనితో బాలయ్య సినిమా మరో సినిమా వీరు దక్కించుకోగా దీనికి అయితే అఖండ ని మించి ఫ్యాన్సీ రేటుని ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. కాగా సినిమాలో కూడా హాట్ స్టార్ తోనే డీల్ కుదిర్చినట్టు కార్డ్స్ లో వేయగా కన్ఫర్మ్ కూడా అయ్యింది.
మరి ఈ సినిమాలో అయితే బాలయ్య సరసన శృతి హాసన్ నటించగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా లో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించగా దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే హానీ రోస్ లు కీలక పాత్రల్లో నటించారు.