ఓరి దేవుడా సినిమా కోసం భారీగా పారితోషికం అందుకున్న వెంకటేష్..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌, మితిలా పార్కర్‌ జంటగా నటించిన తాజా చిత్రం ఓరి దేవుడా. అశ్వత్‌ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవలె అక్టోబర్ 21న థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఓ మై కడవులే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.

ఇటీవలె విడుదల అయిన సినిమా మంచి హిట్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి నటించిన క్యారెక్టర్ ను తెలుగులో విక్టరీ వెంకటేష్ చేశారు. కాగా ఈ సినిమాలో కథన మలుపు తిప్పే దేవుడి పాత్రలో వెంకటేష్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించారు వెంకటేష్.

అయితే ఈ సినిమాలో 15 నిమిషాల పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్నది ఆ వ్యక్తిగతంగా మారింది. ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో తన పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ 5 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నారట. ఇది 5 రోజులకు గాను విక్టరీ వెంకటేష్ మూడు కోట్ల రూపాయలు భారీ పారితోషి కాన్ని అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త విన్న పలువురు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. కేవలం ఐదు రోజులకు మూడు కోట్ల భారీ పారితోషికమా అంటూ ఆశ్చర్యపోతున్నారు..