ఓటిటిలో దుమ్మురేపుతున్న విశ్వక్‌ సేన్‌ ‘గామి’

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ప్రధానపాత్రలో నటించిన ‘గామి’ చిత్రం జీ5 ఓటీటీలో దుమ్మురేపుతోంది. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విధ్యాధర్‌ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే ఆదరణను రాబట్టుకుంటూ.. కేవలం 72 గంటల్లోపే 50 మిలియన్స్‌ స్టీమ్రింగ్‌ మినిట్స్‌ 50 రాబట్టుకోవటం విశేషం.

ఏప్రిల్‌ 12 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్టీమ్రింగ్‌ అవుతోంది. జీ5 ఓటీటీలో ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసిన మేకర్స్‌ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే .. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్‌ ఓ వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. శంకర్‌కి ఉన్న ఈ వ్యాధికి మందు హిమాలయాల్లోని త్రివేణి సంగమం దగ్గర ఉంటుందని, ఆ ఔషధం తీసుకుంటే శంకర్‌ వ్యాధి నయమవుతుందని స్వావిూజీ చెప్తాడు.

ఈ మొక్క కూడా 35 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని.. ఆ సమయంలోనే ఆ మొక్కని తీసుకురావాలని చెప్తాడు. జాహ్నవి ఒక డాక్టర్‌, రీసర్చ్‌ కోసం అదే ఔషధం కోసం ప్రయత్నం చేస్తుంది. శంకర్‌ని ఆ హిమాలయాలకి తీసుకువెళతానంటుంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో ఒక గ్రామంలో దుర్గ అనే దేవదాసి తన కుమార్తె ఉమతో ఉంటుంది. ఆమెకు దేవదాసి నుండి తప్పించేస్తారు, కుమార్తెని దేవదాసిగా చేయాలని చూస్తారు. ఇంకోవైపు ఒక లేబరేటరీలో మనుషుల విూద వివిధ రకాలైన భయంకరమైన పరీక్షలు చేస్తూ ఉంటారు, అక్కడి నుండి ఒక అబ్బాయి తప్పించుకొని బయటపడతాడు.

ఈ మూడు కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. శంకర్‌కు ఆ ఔషధం తీసుకురావడంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి సాధించాడా? జాహ్నవి ఏమైంది? దేవదాసి కుమార్తె తప్పించుకొని ఎక్కడికి వెళ్లింది? బయటపడిన కుర్రాడు ఏమయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘గామి’ సినిమా చూడాల్సిందే.