ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌!

విశ్వక్‌సేన్‌ ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘విశ్వక్‌ సేన్‌ 10’లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. హై ఫోర్స్‌ ఇంజిన్‌ త్వరలోనే షురూ అవుతుంది. ఫన్‌ రైడ్‌ కోసం రెడీగా ఉండండి..అంటూ మేకర్స్‌ లాంఛ్‌ చేసిన పోస్టర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు. మరోవైపు ‘ఛల్‌ మోహన్‌ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘విశ్వక్‌ సేన్‌ 11’ప్రాజెక్ట్‌ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిలో నటిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్‌ ఫోర్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నేహా శెట్టి, అంజలి ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్నారు.