పవన్ కళ్యాణ్ తో కరెక్ట్ సినిమా తీస్తే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లకు పైగానే కలెక్షన్స్ వస్తాయి అని చెప్పవచ్చు. కానీ గత కొంతకాలంగా ఆయన ట్రాక్ చూస్తే మాత్రం సినిమాలు హై రేంజ్ లోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం 100 కోట్ల లాభాలను కూడా అందించడం లేదు. ఇక అజ్ఞాతవాసి నుంచి అయితే పవన్ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి స్థాయిలో అయితే అనుకున్నంత మ్యాజిక్ ఏమీ క్రియేట్ చేయలేదు.
ఇక ప్రతి సినిమాలో కూడా త్రివిక్రమ్ హ్యాండ్ ఉండడం కూడా పెద్ద మైనస్ గా మారుతుంది అనే కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా త్రివిక్రమ్ అని రుజువైంది. ఇక తర్వాత భీమ్లా నాయక్ కూడా దాదాపు త్రివిక్రమ్ చేతిలోనే పూర్తయింది. ఇక ఇటీవల వచ్చిన బ్రో సినిమా కూడా అదే తరహాలో ఫినిష్ అయింది.
అయితే ఈ సినిమాకు మాత్రం త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో మ్యాజిక్ క్రియేట్ చేయలేదు అనే కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన దర్శకుడు కంటే ఎక్కువ స్థాయిలో దాదాపు 20 కోట్ల రేంజ్ లో అయితే పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే త్రివిక్రమ్ కేవలం పవన్ కళ్యాణ్ పొగడమే పనిగా పెట్టుకునే డైలాగ్స్ రాసినట్లు ఉంది అని ఇంకా కథకు తగ్గట్టుగా ఆయన వర్క్ చేసి ఉంటే మరోలా ఉండేది అని అంటున్నారు. సినిమాను తొందరగా ఫినిష్ చేయాలి అనే ఆలోచన కూడా కంటెంట్ లో లోపాలు వచ్చేలా చేసింది అనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా త్రివిక్రమ్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తో ఇలాంటి రీమేక్లు చేయించకుండా ఉంటే బెటర్ అని ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.