Ustaad Bhagat Singh: తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.
తన శక్తివంతమైన రచన, మాస్ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా ‘కల్ట్ కెప్టెన్’ అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే సంభాషణలకు ఈ చిత్రం హామీ ఇస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇది అభిమానులలో, సినీ ప్రేమికులలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ గీతం శ్రోతలను ఉర్రూతలూగించింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం యొక్క నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్లను త్వరలోనే నిర్మాతలు వెల్లడించనున్నారు. ఈ సినిమా నుండి మరిన్ని ఆసక్తికర ప్రకటనల కోసం వేచి ఉండండి.
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా తదితరులు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కథనం: కె. దాశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృధ్వి
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

