Mirzapuram Rani Krishnaveni: ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Mirzapuram Rani Krishnaveni: అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆ తరం నటీమణి, గాయని స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

మహానటుడు ఎన్ . టి. రామారావు గారిని మనదేశం సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణ వేణి గారంటే తనకు ఎంతో గౌరవమని చంద్రబాబు తెలిపారు. ఈ పుస్తకావిష్కరణలో కృష్ణవేణి కుమార్తె అనురాధా దేవి, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, నిర్మాతలు డీవీకే రాజు, ఉమామహేశ్వరరావు, పర్వతనేని రాంబాబు, కాకాని బ్రహ్మం, క్రొత్తపల్లి శ్రీధర్ ప్రసాద్, శ్రీమతి ఝాన్సీ రాణి, యువహీరో అభిరామ్, గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు.

తన పుస్తకం సీఎం చంద్రబాబు ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభవమని రచయిత భగీరథ సంతోషం వ్యక్తం చేశారు.

జనసేన ఉన్మాదం || Advocate Lakshmi Aggressively Reacts on Janasena MLA Arava Sridhar incident || TR