గాసిప్స్ : ముచ్చటగా ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్.?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో పలు హిందీ ప్రాజెక్ట్ లతో పాటుగా మన తెలుగు సినిమా దర్శకులతో కూడా వర్క్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఈ చిత్రాల్లో రీసెంట్ గా లాక్ చేసిన దర్శకుడు మారుతీ కూడా ఒకడు.

మరి మారుతితో ఈ సినిమా ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనుండగా ఆల్రెడీ పలు భారీ సెట్స్ అయితే అయితే ఈ చిత్రం షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం లో ఆల్రెడీ కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా లాక్ అయ్యిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ముందే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ హీరోయిన్స్ మొత్తం ఎవరో కన్ఫర్మ్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి మరో ఇద్దరిలో అయితే ఒకరు మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కాగా మరో హీరోయిన్ యంగ్ హీరోయిన్ రిద్ధి కుమార్ అట. మరి ఈ ముగ్గురు అయితే ప్రభాస్ చిత్రంలో అతనితో రొమాన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికి అయితే ఈ భారీ చిత్రం ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.