టాలీవుడ్ ఎవర్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీల మరియు పాన్ ఇండియా హీరోయిన్ పూజ హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ 28వ సినిమాగా తెరకెక్కుతుంది.
అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమాగా తెరకెక్కుతుండగా ఇప్పుడు రెండో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకొని మూడో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. కాగా ఈ సినిమా రిలీజ్ పై చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ లేటెస్ట్ గా సినీ వర్గాల్లో క్లారిటీ ఇచ్చినట్టుగా వైరల్ అవుతుంది.
ఈ సినిమాని మొదటగా ఈ ఏడాది వేసవి బరిలో ఉంచాలని ప్లాన్ చేశారు కానీ మహేష్ ఫ్యామిలీ లో జరిగిన అనుకోని మార్పులతో మరింత ఆలస్యం అయ్యింది. ఇక దీనితో మేకర్స్ సినిమాని మహేష్ కి సెంటిమెంట్ అయ్యినటువంటి ఆగష్టు నెల లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి.
మరి వీటిని కన్ఫర్మ్ చేస్తూ నాగ వంశి ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆగష్టు లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అలాగే ఇది బహుశా రెండో వారంలో రిలీజ్ ఉండనుంది. కాగా ఈ సినిమా సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.
