Pawan Kalyan: ఇబ్బందులలో నిర్మాత.. పవన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్.. నువ్వు దేవుడు సామీ అంటూ!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు పవర్ స్టార్. మొన్నటి వరకు రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇకపోతే పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఎప్పుడో మొదలయిన హరిహర వీరమల్లు సినిమా అయిదేళ్లుగా సాగి ఇటీవలే షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి కావడంతో జూన్ 12 రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.

అయితే ఈ సినిమా అయిదేళ్లుగా సాగడం, సెట్స్ వేసినవి మళ్ళీ వేయాల్సి రావడం, షూటింగ్ హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చడం, షూటింగ్ లేట్ అవడంతో తెచ్చిన ఫైనాన్స్ కి వడ్డీలు పెరగడం, సినిమా బడ్జెట్ కూడా పెరగడం ఇలా నిర్మాతకు అనుకున్నదాని కంటే కూడా భారీగా ఖర్చు అయిందట. దాంతో నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి పవన్ ఈ సినిమాకు గాను తాను తీసుకున్న 11 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసాడని టాక్. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి ఇప్పుడు ఆ అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసాడట పవన్.

దీంతో ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఏమి తీసుకోకుండానే పనిచేసినట్లు అయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన లాభాల్లో నుంచి పవన్ రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పవన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు దేవుడు సామీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది కదా పవర్ స్టార్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.