Siddhu Jonnalagadda: గొప్ప మనసు చాటుకున్న సిద్దు జొన్నలగడ్డ.. సినిమా ఫ్లాప్ అవడంతో డబ్బులు మొత్తం అలా!

Siddhu Jonnalagadda: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు కొన్ని కొన్ని సార్లు ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడం అన్నది కామన్. ఇలా సినిమా ఫ్లాప్ అవడం అన్నది నిర్మాతలకు భారీగా నష్టాన్ని మిగిల్చే విషయం అని చెప్పాలి. అయితే ఇలా సినిమాలు ఫ్లాప్ అయినా సందర్భాలలో కేవలం కొంతమంది హీరోలు మాత్రమే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. సినిమా ఫ్లాప్ అవడంతో పాటు నిర్మాతలు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో వారి రెమ్యూనరేషన్ లో కొంత భాగం వెనక్కి ఇవ్వడం లేదంటే పూర్తిగా వెనక్కి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఇలా కొంతమంది హీరోలు మాత్రమే చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఈ విధంగా సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొంతమంది హీరోలు రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ కూడా తన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇదే పని చేసాడట. సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. జాక్ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో స్పై కామెడీ జానర్లో తెరకెక్కించారు. ఈ సినిమా ప్లాప్ అవడంతో తన రెమ్యునరేషన్ లో సగం అనగా 4 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చేశారని టాక్. ఈ సినిమాకు సిద్దు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అందులో ఇప్పుడు సగభాగం మొత్తం నిర్మాతకు ఇచ్చేసినట్టు తెలుస్తోంది.

ఈ విషయం తెలిసి అభిమానులు సిద్దు జొన్నలగడ్డపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చిన్న హీరో అయినప్పటికీ తన పెద్ద మనసుతో చాలా మంచి సహాయం చేసి నిర్మాతను ఆదుకున్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సిద్దు వైష్ణవి చైతన్య జంటగా నటించిన జాక్ సినిమా ఇటీవల ఏప్రిల్ 10న విడుదల అయ్యి ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమానెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సిద్దు.