Allu Aravind: ఈడీ విచారణ పై స్పందించిన అల్లు అరవింద్.. అందుకే వెళ్ళానంటూ క్లారిటీ!

Allu Aravind: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ఈడి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపు 3 గంటల పాటు ఈయనను అధికారులు ప్రశ్నించారు అదేవిధంగా వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ గురించి ఈయన విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది.. ఇలా ఈ బ్యాంకు స్కామ్ లో భాగంగా జరిగిన లావాదేవీలతో పాటు ఆస్తుల కొనుగోలు విషయంపై కూడా అధికారులు విచారణ చేసినట్టు సమాచారం.

ఇలా మూడు గంటల పాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఆయనని విచారించిన అధికారులు తిరిగి వచ్చేవారం కూడా విచారణకు రావాలని తెలిపారు.. ఇలా ఈడి అధికారులు తనని విచారించిన నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ ఘటన పై స్పందించారు.2017లో ఓ ప్రాపర్టీలో ఒక మైనర్ వాటాదారుడి భాగాన్ని తాను కొనుగోలు చేశానని…. అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అరవింద్ తెలిపారు.

ఆ మైనర్ వాటాదారుడు బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించలేదని చెప్పుకొచ్చారు. అయితే అకౌంట్స్ బుక్‌లో తన పేరు ఉండటం వల్ల ఈడీ విచారణకు పిలిచిందన్నారు. బాధ్యత గల పౌరుడిగా తాను విచారణకు హజరయ్యానని… ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని ఈయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక తదుపరి వారం కూడా విచారణకు రావాలని తెలుపగా తాను హాజరు కాబోతున్నట్టు తెలియజేశారు. మూడు గంటల పాటు ఈడీ విచారణ జరిపిన ఈడీ అల్లు అరవింద్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుంది. ఇలా ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కాం కి సంబంధించిన విచారణలో అల్లు అరవింద్ హాజరు కావడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.