మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించాల్సింది కృతి శెట్టి కాదా?

నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి కృతి శెట్టి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నటించే అవకాశం కృతి శెట్టికి రాలేదని, మరొక స్టార్ హీరోయిన్ కి ఈ అవకాశం రావడంతో ఆమె నో చెప్పడం వల్లే ఈ సినిమాలో కృతి శెట్టి నటిస్తోందని తెలుస్తోంది.

మరి మాచర్ల నియోజకవర్గం సినిమా చేసే అవకాశం ముందుగా ఎవరికి వచ్చింది? ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయానికి వస్తే… నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమా ద్వారా ఆయన సరసన రష్మిక సందడి చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా చేయాలని భావించి నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ గా రష్మికను సంప్రదించారు.ఈ విధంగా ఈ సినిమాలో నటించే అవకాశం తనకు కల్పించడంతో రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.

ఈ సినిమా రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే అప్పట్లో ఈమె పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన కాల్ షీట్స్ కుదరకపోవడంతో తన స్థానంలో కృతి శెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం భీష్మ సినిమా షూటింగ్ సమయంలో నితిన్ రష్మిక మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయని ఆ మనస్పర్ధలు కారణంగానే రష్మిక నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించడానికి సానుకూలంగా స్పందించలేదని సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.