ఎప్పుడు ఏ సినిమా తాలూకా హైప్ ఎలా ఉంటుందో ఎప్పుడూ చెప్పలేం. అప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న సినిమాని అయితే లాస్ట్ మినిట్ కి జీరో హైప్ లోకి వచ్చేస్తాయి. అదే విధంగా బాగా లేట్ అయినా కూడా ఓ సినిమా హైప్ తగ్గిపోతుంది.
ఇప్పుడు ఇదే కోవలో అక్కినేని అఖిల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్” వెళ్లేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా కొంత కాలం కితం వరకు అయితే ఏజెంట్ కి సెన్సేషనల్ హైప్ అండ్ బిజినెస్ నంబర్లు ఉన్నాయి. కానీ ఇపుడు సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలే ఉన్నప్పటికీ బయ్యర్లు పెద్దగా ఆసక్తి ఈ సినిమాకి చూపించట్లేదట.
ఇది షాకింగ్ అని చెప్పాలి. ఒకప్పటి సాలిడ్ హైప్ తో 50 కోట్ల మేర మార్కెట్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది కానీ రిలీజ్ దగ్గరలో అయితే సినిమాకి మరింత హైప్ ఉంటుంది అని మేకర్స్ ఆపి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏమో సీన్ రివర్స్ అయ్యేలా ఉంది.
అంతే కాకుండా చాలా చోట్ల ఏజెంట్ ని సొంతంగా రిలీజ్ చేసుకునే పరిస్థితిలో కూడా ఉందని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వం తెరకెక్కించగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
