Akhil Akkineni: పెళ్లి తర్వాత మొదటి సారి అలాంటి పోస్ట్ చేసిన అఖిల్.. పోస్ట్ వైరల్!

Akhil Akkineni: టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అఖిల్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కెరిర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అఖిల్ ఇటీవల ఒక ఇంటి వాడైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని పెళ్లి చేసుకున్నారు. కాగా ఈ నెల అనగా జూన్ 6న జూబ్లీహిల్స్‌ లో నాగార్జున నివాసంలో అఖిల్, జైనాబ్‌ల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.

ఇరువురి కుటుంబ సభ్యులు,సన్నిహితులు, స్నేహితులు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట రిసెప్షన్ వేడుక కూడా గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్‌ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. అఖిల్,జైనాబ్ రవ్డీల పెళ్లి వేడుక ఫొటోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే హీరో అఖిల్ పెళ్లి తర్వాత ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. కానీ మొదటిసారి పెళ్లి తర్వాత పోస్ట్ చేశారు అఖిల్. ఆ పోస్టులు తన పెళ్లి వేడుకకు సంబంధించిన మరికొన్ని ఫోటోలను షేర్ చేశారు.

నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించింది అంటూ క్రేజీ క్యాప్షన్ ని కూడా జోడించారు అఖిల్. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు అఖిల్. ఈ సందర్బంగా అఖిల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే అఖిల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మొదట శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు శ్రీలీలకు బదులు భాగ్యశ్రీ భోర్సేను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి..