Akhil Akkineni Reception: అఖిల్ రిసెప్షన్‌కు ఆ స్టార్ హీరోలు ఎందుకు రాలేదు?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కొత్త జీవన ప్రయాణానికి మొదటి అడుగు వేసిన తర్వాత… అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఆయన వివాహ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహేష్ బాబు, వెంకటేష్, రామ్ చరణ్, నాని, సుకుమార్, అల్లరి నరేష్, సుధీర్ బాబు, కె.ఎల్. నారాయణ లాంటి ప్రముఖులు అఖిల్ – జైనబ్‌ను ఆశీర్వదించారు. అక్కినేని నాగార్జున స్వయంగా పలువురిని ఆహ్వానించినా, కొంతమంది మాత్రం రాలేకపోవడం గమనార్హం.

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ లో ఉన్న బడా హీరోలు మాత్రం ఈ రిసెప్షన్‌కు దూరంగా ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శర్వానంద్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యువతరం హీరోలు ఎవరూ ఈ వేడుకలో కనిపించలేదు. వీరందరికీ ఫామిలీ నుండి ప్రత్యేక ఆహ్వానం వెళ్లిందన్న మాట ఫిలింనగర్ లో వినిపించినా, షూటింగ్ షెడ్యూల్స్, వ్యక్తిగత పనులు వంటి కారణాలతో హాజరు కాలేకపోయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.

ఇక అఖిల్, జైనబ్ ల ప్రేమ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఓ కార్యక్రమంలో కలుసుకున్న ఈ జంట త్వరగా ఒకరిని ఒకరు మెచ్చుకుని, కుటుంబ సభ్యుల సమ్మతితో ఉంగరాలు మార్చుకుంది. దశలవారీగా జరిగిన ఈ ప్రేమ కథకు తాజాగా పెళ్లితో ముగింపు, కొత్త మొదలు లభించింది. ఇప్పుడీ వివాహ వేడుకలోని గ్లామర్, హాజరైన.. రాని సెలబ్రిటీల చర్చతో పాటు, కొత్త జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కన్నప్పలో ప్రభాస్ || Director Geetha Krishna Great Words About PRABHAS In Kannappa || Telugu Rajyam