Akhil Akkineni: టాలీవుడ్ హీరో అఖిల్ తాజాగా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెబుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జూన్ 6వ తేదీన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో కలిసి ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుక చాలా సింపుల్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఇకపోతే ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన మ్యారేజ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పెళ్లికి హాజరు కాలేని సెలబ్రెటీలు సైతం నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే రేపు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి రిసెప్షన్ వేడుక చాలా గ్రాండ్ గా జరగనుంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థంతో ఒకటి అయిన విషయం తెలిసిందే. ఇకపోతే అభిమానులు,నెటిజన్స్ అఖిల్ సతీమణి జైనాబ్ రవ్జీ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్, జైనాబ్ విద్యార్హతల గురించి నెట్టింట తెగ ప్రచారం నడుస్తోంది. జైనాబ్ హైదరాబాద్ లోని గీతాంజలి స్కూల్, నాసర్ స్కూల్ లో చదువుకుంది.
కాగా ఆమె హామ్స్‌టెక్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ విద్యను కూడా పూర్తి చేసింది. అఖిల్ చైతన్య విద్యాలయంలో చదువుకున్నాడు. రెండేళ్లు ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు. హైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అతను సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నుండి బిబిఎ డిగ్రీని కూడా పొందాడు. ఆ తర్వాత న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందిన విషయం తెలిసిందే. జైనాబ్ ప్రతిభావంతులైన కళాకారిణి, పెర్ఫ్యూమర్ బ్లాగర్. ఆమె 7 సంవత్సరాల వయస్సులో పెయింటింగ్ ప్రారంభించిందట. ఆమె వన్స్ అపాన్ ది స్కిన్ అనే బ్లాగును కూడా నడుపుతోంది. ప్రస్తుతం అఖిల్ సినీరంగంలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతె లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో ఎలా అయినా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు హీరో అఖిల్.