Akhil Akkineni: పెళ్లి విషయంలో తండ్రిని ఫాలో అయిన అఖిల్… సేమ్ టు సేమ్ దించేశాడుగా?

Akhil Akkineni: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ వివాహపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈయన వివాహాం జైనాబ్ అనే అమ్మాయితో జరిగిన సంగతి తెలిసిందే. గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న నేపథ్యంలో పెద్దల సమక్షంలో వీరిద్దరూ జూన్ ఆరో తేదీ నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా వివాహం జరుపుకున్నారు. ఈ వివాహ వేడుకలకు కేవలం కుటుంబ సభ్యులు అలాగే అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఇలా సింపుల్ గా వివాహం జరిగినప్పటికీ అన్నపూర్ణ స్టూడియోలో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి వీరి వివాహ రిసెప్షన్ వేడుకను ఘనంగా జరిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నాగార్జున తన చిన్న కొడుకుకి ఇలా సింపుల్ గా పెళ్లి చేయడం ఏంటి అంటూ కూడా పలువురు విమర్శలు కురిపించారు. అంతేకాకుండా తాజాగా నాగార్జున వివాహం అఖిల్ వివాహపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అఖిల్ తన పెళ్లి విషయంలో తన తండ్రి నాగార్జునను ఫాలో అయ్యారని తెలుస్తుంది.

నాగార్జున తన మొదటి వివాహం లక్ష్మీతో జరుపుకున్నారు. ఈ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిపించినప్పటికీ ఈ వివాహ బంధం ఎక్కువ కాలం పాటు నిలబడలేదని చెప్పాలి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి అమలను నాగార్జున రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ సమయంలో నాగార్జున, అమల కూడా ఇలాగే తెల్లని దుస్తులతో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం నాగార్జున అమల పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు అఖిల్ జైనాబ్ పెళ్లి ఫోటోలను వైరల్ చేస్తూ పెళ్లి విషయంలో నాన్న లాగే ఆలోచించి, తన తండ్రిని ఫాలో అవుతూ అఖిల్ పెళ్లి చేసుకున్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు.