Eesha Movie: భయపెడుతున్న ‘ఈషా’ వార్నింగ్‌ వీడియో.. ‘ఈషా’ మేకర్స్‌ నుంచి మరో వీడియో విడుదల

Eesha Movie: ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది తెలిసిందే.. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే సడన్‌ ట్విస్ట్‌లను, హారర్‌ సీన్స్‌ను హార్ట్‌వీక్‌గా ఉన్న వాళ్లు చూడకూడదని మేకర్స్‌ నుంచి వార్నింగ్‌ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ‘ఈషా’ వార్నింగ్‌ పేరిట శనివారం మరో వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోను గమనిస్తే.. ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వార్నింగ్‌ పేరిట ఇలాంటి వీడియోను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అని ట్రైలర్‌ లో భయపెట్టిన ఈ చిత్ర దర్శకుడు ఈ వార్నింగ్‌ వీడియోలో మనుషుల్లాగే కొన్నిస్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి.. తరువాత అవి క్రమంగా ఆత్మలకు నిలయాలుగా మారుతాయి అంటూ ఈ తాజా వీడియోలో వార్నింగ్‌ ఇస్తున్నాడు.. ఈ ప్రత్యేకమైన వార్నింగ్‌ వీడియోలో కూడా ప్రేక్షకలు ఉలిక్కిపడే ట్విస్ట్‌లు పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది. దెయ్యాలు, ఆత్మలు ఇలాగే ఉంటాయెమో అంటూ సిరి చెప్పే డైలాగ్‌.. అందరిని ఒక్కసారిగా ఆత్మల గురించి అందరి మదిలో మెదిలేటట్టు చేస్తుంది.

ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దొంగ బాబాలను ఎక్స్ పోజ్ చేయడానికి బయలుదేరిన వీరికి, బాబ్లూ పృథ్వీరాజ్ రూపంలో ఒక సవాలు ఎదురవుతుంది. “ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే..” అంటూ ఆయన విసిరే ఛాలెంజ్ తో వీరు ఒక చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు. సైన్స్ కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ దీన్ని ఆసక్తికరంగా మలిచారు.ట్రైలర్ లోని విజువల్స్ చాలా వరకు బ్లూ అండ్ డార్క్ థీమ్ లో సాగాయి. ముఖ్యంగా ఆ పాడుబడిన బంగ్లా, అక్కడ నేల మీద వేసి ఉన్న యంత్రాలు, క్షుద్ర పూజల సెటప్ సినిమాలోని మూడ్ ని ఎలివేట్ చేశాయి. కెమెరామెన్ సంతోష్ లైటింగ్ వాడిన విధానం, దానికి ఆర్ఆర్ ధృవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై కొన్ని చోట్ల ఉలిక్కిపడేలా చేశాయి. సౌండ్ డిజైన్ హార్రర్ సినిమాలకు ఎంత ముఖ్యమో ఈ సినిమా సౌండ్‌ డిజైనింగ్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందేమో అనిపిస్తుంది. డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.ఈ చిత్రం వీడియో కంటెంట్‌ అందరిలోనూ ఇంత భయాన్ని కలుగజేస్తుంటే ఈ నెల 25 నుంచి థియేటర్‌లో ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ..

మీర్‌పేట కుక్కర్ కేసు || Cine Critic Dasari Vignan Reveals Meerpet Husband Cooker Murder Case || TR