ఆ వయసులో అది అర్థంకాక ఆపని చేశానంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన శివ జ్యోతి!

రెండు తెలుగు రాష్ట్రాలలో శివ జ్యోతి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఈమె న్యూస్ ప్రజెంట్ గా తెలంగాణ యాసతో మాట్లాడుతూ విశేషంగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే శివజ్యోతి తనకు ఉన్న పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈమె బిగ్ బాస్ ద్వారా పూర్తిగా తన కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేయడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

Shiva Jothi | Telugu Rajyamఇదిలా ఉండగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న శివ జ్యోతి సూపర్ క్వీన్ అంటూ ప్రారంభమైన మరొక షోలో సందడి చేశారు.ఈ సందర్భంగా శివ జ్యోతి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా శివ జ్యోతి మాట్లాడుతూ తను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డానని ఆ సమయంలోనే గంగోలి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా తనని పెళ్లి చేసుకున్నట్లు ఇదివరకే ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. మరోసారి ఈ వేదికపై తన ప్రేమ గురించి మాట్లాడారు.

ఆ సమయంలో తమ తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పిన వారి ప్రేమ మనపై ఎంత ఉందో గుర్తించలేకపోయాను. అయితే ఇప్పుడు తాము తల్లిదండ్రుల కావాలని అనుకుంటున్నప్పుడు వారి ప్రేమ ఎంత ఉందో అర్థమవుతోంది. ఆ వయసులో వారి ప్రేమ అర్థం కాలేదని ఈ సందర్భంగా శివ జ్యోతి ఎమోషనల్ అయ్యారు. అయితే అన్ని అరేంజ్డ్ మ్యారేజ్ లు సక్సెస్ కావాలని అన్ని లవ్ మ్యారేజ్ లు ఫెయిల్యూర్ కావని ఎలాంటి వివాహం చేసుకున్న కాంప్రమైజ్ కావాల్సిందేనని ప్రతి ఒక్కరు మరొకరికి సపోర్ట్ చేయాల్సిందేనని తన విషయంలో తన భర్త చేస్తున్న సపోర్ట్ గురించి మాట్లాడుతూ శివ జ్యోతి ఈ సందర్భంగా ఎమోషన్ అయ్యారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles