‘హిట్-3’లో సమంత.? నాని ఆలోచన ఇదేనా.?

అడివి శేష్ తాజా చిత్రం ‘హిట్-2’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకి మంచి టాక్ వినిపిస్తోంది. సందట్లో సడేమియా ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే, ‘హిట్-3’ కోసం సమంతతో ఇప్పటికే నాని సంప్రదింపులు జరిపాడని. నాని నిర్మాతగా వ్యవహరించాడు ‘హిట్-2’ సినిమాకి. ‘హిట్-3’లో నాని నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతున్నా, తానే నిర్మాతగా.. తానే హీరోగా.. అన్న ఆలోచన ప్రస్తుతానికి నానికి లేదట.

‘హిట్-1’ కోసం విశ్వక్ సేన్‌ని తీసుకున్నారు. ‘హిట్’ అనేది ఓ ఫ్రాంఛైజీగా మారిపోయింది. ఒక్కో కేసు.. ఒక్కో పోలీస్ అధికారి.. ఇలా సాగుతోంది వ్యవహారం. సో, మూడో కేసు ఖచ్చితంగా ఓ మహిళా పోలీస్ అధికారి డీల్ చేసే అవకాశం వుందంటున్నారు.

సమంత గురించి కొత్తగా చెప్పేదేముంది.? థ్రిల్లర్ సినిమాలంటే సమంత చెలరేగిపోతుంది. అయితే, ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగా లేదు. ఆమె ముందు ‘ఖుషీ’ సినిమా పూర్తి చేయాల్సిన టాస్క్ వుంది. ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. కానీ, నాని మనసులో మాత్రం ‘హిట్-3’ కోసం ఫస్ట్ ఛాయిస్ సమంతేనని తెలుస్తోంది.