మెగా ఫ్యామిలీపై మరోసారి నోరు జారిన రోజా.!

ministerroja1-1657782493

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యంగా అయితే ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనేలా అయితే పరిస్థితి లేదు. రెండు కూడా ఒకటే అన్నట్టు పరిస్థితి ఏర్పడింది. పలువురు రాజకీయ నేతలు సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడం. మరికొందరు సినీ పరిశ్రమ ప్రముఖలపైనే అవాకులు చవాకులు అంటూ ఉండడం పెద్ద ఎత్తున చర్చలకు దారి తీస్తున్నాయి.

మరి వారిలో ఏపీ టూరిజం శాఖా మంత్రి అలాగే ప్రముఖ నటి అయినటువంటి రోజా మరోసారి మెగా ఫ్యామిలీ హీరోస్ పై సంచలన కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. మరి కొన్ని రోజులు కితమే చిరు పవన్ నాగబాబు లపై కామెంట్స్ చేసిన ఆమె ఇప్పుడు తాజాగా మొత్తం మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీ లో మెగా కుటుంబాన్ని ఎదిరించి ఉండలేరని వారిని మెగా ఫ్యామిలీ బెదిరిస్తారు కాబట్టే ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి సపోర్ట్ చేస్తారు అని రోజా లేటెస్ట్ గా మీడియాతో చెప్పడం సెన్సేషన్ గా మారింది. అయితే రోజా మాత్రం ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ ని బాగా టార్గెట్ చేస్తూ ఉండడం ఆసక్తిగా మారుతూ వస్తుంది.

మరి ఇది ఏమన్నా యాదృచ్చికంగా జరుగుతున్నదేనా లేక కావాలని టార్గెట్ చేస్తున్నట్టా అనేది మాత్రం అర్ధం కావట్లేదు. అయితే రోజా కామెంట్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ ని మరింత బాధకి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు.