Mana Shankara Vara Prasad Garu Trailer: మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచింది. సినిమా ప్రమోషన్‌లు ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్లింప్స్, పాటలు, పోస్టర్ అంచనాలను పెంచాయి. ఈరోజు, మేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఒకప్పుడు దేశ భద్రతా సంస్థల్లో కీలకంగా సేవలందించిన శంకర వర ప్రసాద్, శశిరేఖను ప్రేమించి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి మారుతాడు. ఫ్యామిలీ మ్యాన్ గా ప్రశాంతంగా కనిపించినా, అతనిలోని వింటేజ్ ఫైర్, నేచురల్ ఇన్‌స్టింక్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వచ్చినప్పుడు, వాటిని శంకర వర ప్రసాద్ తనదైన స్టైల్‌లో ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ యొక్క ప్రధానాంశం.
చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవిని హిలేరియస్ రోల్‌లో చూడటం ప్రేక్షకులకు మెగా ట్రీట్ గా నిలిచింది. ఆయన గ్రేస్, స్వాగ్, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిసి ఎందుకు ఆయన ‘మెగాస్టార్’ అనిపించుకుంటారో మరోసారి గుర్తు చేస్తాయి. వెంకటేష్ పవర్‌ఫుల్ మాస్ ఎంట్రీ ప్రేక్షకులను ఎక్సయిట్మెంట్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. ఈ ఇద్దరు స్టార్స్ మధ్య వచ్చే కెమిస్ట్రీ, సరదా పంచ్ డైలాగ్స్ అభిమానులకు విజువల్ ఫీస్ట్‌గా నిలుస్తాయి.
నయనతార సంప్రదాయంగా, ఎంతో అందంగా కనిపిస్తూ, చిరంజీవితో ఆమె కెమిస్ట్రీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్ చేస్తుంది. సచిన్ ఖేడేకర్ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించగా, మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన మ్యాజిక్ ని చూపించారు. మెగాస్టార్‌ను వింటేజ్, కరిష్మాటిక్ గా చూపడమే కాకుండా, వినోదం–యాక్షన్‌లను సమతూకంగా మేళవించి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను రూపొందించారు. చిరంజీవిని అద్భుతంగా ప్రెజెంట్ చేయడం, వెంకటేష్‌ను కథలో కీలకంగా తీసుకురావడం సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్స్.
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ స్టైలిష్‌గా, వైబ్రెంట్‌గా ఉండగా, భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నోస్టాల్జిక్ ఫీల్‌ను అందిస్తుంది. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ సినిమా వరల్డ్ కి మంచి రిచ్‌నెస్‌ను తీసుకొచ్చింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ప్రొడక్షన్ వాల్యూస్‌ను అత్యున్నతంగా వున్నాయి.

మెగాస్టార్ అన్‌మ్యాచ్డ్ స్వాగ్, వింటేజ్ ఛార్మ్, అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ హిలేరియస్ కామెడీ, వెంకటేష్ ఇంపాక్ట్ ప్రెజెన్స్‌తో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్‌గా కాబోతోంది. ఈ హైలీ ఎంటర్టైనింగ్ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంటు. ప్రతి సినిమా రిలీజ్ కి ఇక్కడికి వస్తాను. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను. ఆయన దయవలన కెరీర్ చాలా హ్యాపీగా ఉంది. అలాంటి తిరుపతిలోనే ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలి అనుకుంటున్నానో, ఆయన నాకు ఎలా ఇష్టమో, ఆయనలో నాకు ఏం నచ్చుతాయి అనే ఆలోచనతో ఈ కథని రాసుకున్నాను. దానికి తగ్గ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ ట్రైలర్ లో చూసింది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. సినిమా చూసిన తర్వాత ఒక టైం మిషన్ ఎక్కి ఒక రౌండ్ వేసి వస్తారు. అది మాత్రం గ్యారెంటీ. చిరంజీవి గారు లీడర్ రాజు, ఆటో జానీ.. ఇలాంటి క్యారెక్టర్స్ లో ఆయన మనకు విపరీతంగా నచ్చుతారు.
నేను ఆ అలాంటి బేసిస్ లోనే ఈ శంకర వరప్రసాద్ క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. చిరంజీవి గారిలో ఉన్న ఫన్ టైమింగ్ నేచురల్ ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం. నేను రాసిన దాని కంటే చిరంజీవి గారు దాన్ని వంద రెట్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రజెంట్ చేశారు. ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు.మీసాల పిల్ల 100 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఇంకా అద్భుతంగా వెళుతుంది. అలాగే శశిరేఖ సాంగ్, వెంకటేష్ గారితో చిత్రీకరించిన పాట అన్ని పాటలు కూడా మాస్ కి యూత్ కి ఫ్యామిలీ కి అందరికి నచ్చుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం నా కెరీర్ లో స్పెషల్ ఫిలిం. ఆ సినిమాని మీరందరూ థియేటర్స్ లో అద్భుతంగా సెలబ్రేట్ చేశారు. ఇది నా నాలుగో సంక్రాంతి సినిమా. తప్పకుండా మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు. ఎక్స్ ట్రార్డినరీ ఉందని చెప్పారు. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ సంతోషంతో బయటికి వస్తారు.
చిరంజీవి గారి అభిమానులు కళ్యాణ్ బాబు గారి అభిమానులు చరణ్ గారి అభిమానులు, అందరూ స్టార్ ఫ్యాన్స్.. ఎక్కడో ఒకచోట చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యే ఉంటారు. అందరూ వచ్చి ఈ సినిమా చూడండి. మెగాస్టార్ సెలబ్రేట్ చేసుకోండి. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఫ్రెండ్స్ లా కలిసిపోయి పని చేశారు. ఆ ఇద్దరు స్టార్స్ ని ఒకే ఫ్రేంలో చూడటం పండగలా వుంటుంది. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మెగా రైడ్ ఉండబోతుంది. నయనతార గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. ఈవెంట్ ఎంత అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. జనవరి 12 మళ్లీ నవ్వుకుందాం.. మళ్ళీ ఎంజాయ్ చేద్దాం.. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం.
నిర్మాత సాహుగారపాటి మాట్లాడుతూ.. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు. ఈసారి ఇద్దరు హీరోలతో వస్తున్నారు. మనందరం కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి పెరిగిన వాళ్ళమే. ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నామో అనిల్ గారు అంతే అద్భుతంగా చూపించారు. ఈ సినిమా సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. సినిమా నుంచి చాలా అద్భుతంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం .పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను.

నిర్మాత సుస్మిత కొణిదల మాట్లాడుతూ.. గుడ్ ఈవెనింగ్ తిరుపతి. సంక్రాంతికి ట్రీట్ ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. సినిమా మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అనే ఎక్సైట్మెంట్ ఉంది. ఇది ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్. ఆయన స్టైల్ మా డైరెక్టర్ గారు అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేశారు. దాన్ని ఎలివేట్ చేయడానికి విక్టరీ వెంకటేష్ గారు నయనతార అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్ రాబోతుంది. అందరూ కూడా సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. నేను ఎప్పుడు కూడా మెగాస్టార్ గారికి వీరాభిమా. అనిల్ రావిపూడి ని సంక్రాంతి పందెంకోడి అంటున్నారు. నేను రెక్కల గుర్రం అంటాను. రెక్కల గుర్రం మీద చిరంజీవిగారి ఎక్కారు. అది మామూలుగా ఉండదు. ట్రైలర్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. ట్రైలర్ యాలవుంటే సినిమా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సంక్రాంతి బరిలో ఘనమైన విజయం నమోదు చేయడానికి శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు. మనందరినీ గొప్పగా అలరించబోతున్నారు.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు – సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ – శ్రీమతి అర్చన
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
డీవోపీ – సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ – తమ్మిరాజు
రచయితలు – ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ – నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ – సత్యం బెల్లంకొండ
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

