Ram Gopal Varma: కేసు విచారణకు రాంగోపాల్‌ వర్మ డుమ్మా.. 25న విచారణ కావాలని మళ్లీ నోటీసులు

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై (Ram Gopal Varma) ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. డుమ్మా కొట్టాడు. ఈ నేపథ్యంలో పోలీసులు వర్మకు (Ram Gopal Varma) మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Vyooham Movie Review : ‘వ్యూహం’ మూవీ రివ్యూ & రేటింగ్..

అంతకుముందు తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల విచారణకు రాలేనని ఒంగోలు రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌ బాబుకు వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టాడు వర్మ. విచారణకు సహకరిస్తానని చెప్పిన వర్మ పోలీసులను వారం రోజుల గడువు కోరాడు. ‘వ్యూహం’ (Vyooham Movie) సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu), మంత్రి లోకేష్‌ (Nara Lokesh), నారా బ్రాహ్మాణిలను (Nara Brahmani) కించపరిచేలా రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు గాను మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇవ్వగా.. మంగళవారం వర్మ (Ram Gopal Varma) కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే వర్మ ఏపీ హైకోర్ట్‌ను ఆశ్రయించి క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే వర్మ క్యాష్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వర్మ చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్‌ కొట్టివేసింది. అలాగే అరెస్ట్‌ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలని సూచించింది.

Analyst Dasari Vignan About Pushpa Event || Allu Arjun || Jr NTR || Ram Charan || Pawan Kalyan || TR